24, డిసెంబర్ 2011, శనివారం
కథ: అం'తరాలు ' -మారసాని విజయ్ బాబు
20, డిసెంబర్ 2011, మంగళవారం
మహత్తర జీవిత కాంక్ష
పుస్తకాలు మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భావాల, ఉద్రేకాల, సంఘటనల, భయంకర గందరగోళంలో నుంచి బయటపడేందుకు అవి మీకు స్నేహపూరితమైన ఆలంబనను ఇస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయాన్నీ, మేధను, మనిషిపట్ల ప్రేమతో నింపివేస్తాయి.మనుషుల్లో మీరు చూడనిదాన్ని, ఎదుటివారు చెప్పడానికి ఇష్టపడనిదాన్ని పుస్తకాలు మీకు చెబుతాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, స్వాభావిక, ప్రాకృతిక తదితర కారణాల చేత మనిషి సతతం నిక్షిప్తం చేసుకున్న వైరుధ్యాలను బహిర్గతం చేస్తాయి. ఎందుచేతనైనాగానీ వారు పోషించే అల్పత్వాలను పరిహసిస్తాయి. అలాగే సర్వ శ్రేష్టతనూ ప్రసంశిస్తాయి. మానవుడి సర్వకాల సర్వావస్థలను చిత్రణచేసినవి పుస్తకాలే. సారంలో ప్రపంచ మానవులందరి బాధలు ఒక్కటే. మనిషిపై ఆధిపత్యశక్తులు చేసే దోపిడీని, చూపే వివక్షను మానవ ప్రేమికులు అన్ని కాలాల్లోనూ అడ్డుకుంటూనే ఉన్నారు. వారి గురించి తెలుసుకోవడమంటే... మానవుడి శ్రేష్టమైన గౌరవం గురించి తెలుసుకోవడమే. ఒక మనిషితో ఎళ్ల తరబడి సాహచర్యమంచేసినా అతడి లేక ఆమె గురించి పాక్షికంగా మాత్రమే తెలుసుకోగలరు. అదే సమగ్రంగా చిత్రించిన ఒక మంచి పుస్తకం... ఒక మనిషి జీవితాన్ని అన్ని కోణాల్లో మీకు చెబుతుంది. పుస్తకాలు చదవడం అంటే జీవితాలను చదవడమే. చరిత్రను చదవడం. సంస్కృతిని అర్థంచేసుకోవడం. మహా భారతం, రామాయణ గ్రంథాలు, గాథలు భారత సంస్కృతిపై చూపుతున్న ప్రభావం విస్మరించరానిది. వేల వేళ్లుగా గడచివస్తున్న చరిత్రను, సంస్కృతిని మేరు అర్థంచేసుకోవాలంటే పుస్తకాలకు మించిన సాధనాలు లేవు. వాస్తవ జీవితాన్ని మాత్రమే తెలియజేసి అంతటితో తన పని అయిపోయిందని వూరుకోదు సాహిస్యం. జీవితం ఇప్పుడున్న స్థితికంటే ఒకడుగు ముదుకువేయాలంటే ఏం చేయాలో కూడా సూచిస్తుంది. కనీసం ఆ రకమైన ఆలోచననైనా మీలో రెకెత్తిస్తుంది. ఆడుగడుగునా జీవితంపైన విరక్తి పుట్టడానికి గల కారణాలను విశ్లేషిస్తూనే వైరాగ్యం పోగొట్టి జీవితాన్ని సుఖమయం చేసుకోగలమన్న ఆశను, తపనను కలిగిస్తోంది. మహత్తర జీవిత కాంక్షను కలిగించేది సాహిత్యం ఒక్కటే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
